కర్ణాటక బీజేపీలో కలకలం రేపుతున్న సిద్ధరామయ్య వ్యాఖ్యలు
- యడియూరప్ప పనితీరుపై 20 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి
- అది బీజేపీ అంతర్గత వ్యవహారమన్న కాంగ్రెస్ అధిష్ఠానం
- సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉత్తర కర్ణాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి యడియూరప్ప పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు ఇటీవల వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేల్లో కొందరు తనను కలిశారని సిద్ధరామయ్య నిన్న తెలిపారు. తనను కలిసిన వారు ముఖ్యమంత్రి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, అయితే, ఈ విషయంలో తానేమీ చేయలేనని వారితో చెప్పినట్టు మాజీ సీఎం పేర్కొన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్.. ఇది బీజేపీ అంతర్గత వ్యవహారమని, యడియూరప్ప ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయబోమని తేల్చి చెప్పింది.
మరోవైపు, సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఓటమి నుంచి కోలుకోని సిద్ధరామయ్య ఇలాంటి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యల్లో నిజం లేదని, అయినా తమ ఎమ్మెల్యేలు ఆయనను ఎందుకు కలుస్తారని ప్రశ్నించారు. ఆయనిక ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని తేల్చి చెప్పారు. యడియూరప్పపై ఎవరూ అసంతృప్తిగా లేరని, ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుందని ప్రకాశ్ ధీమా వ్యక్తం చేశారు.