గుంటూరు జిల్లాలోని ఓ హోటల్‌లో కలుషిత ఆహారం.. 20 మందికి అస్వస్థత.. ఆసుపత్రులకు తరలింపు
- గుంటూరులోని తూములూరులో ఘటన
- వాంతులు చేసుకున్న కస్టమర్లు
- బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో తెరచుకున్న గుంటూరు జిల్లాలోని ఓ హోటల్‌లో ఈ రోజు ఉదయం కలకలం రేగింది. కొల్లిపర మండలం తూములూరులోని ఓ హోటల్‌లో చాలా మంది టిఫిన్ తిన్నారు. అనంతరం 20 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లే వారు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది.
వారందరినీ పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. వారంతా ఆ హోటల్‌లో టిఫిన్ తిన్న అనంతరం వాంతులు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అలాగే కొందరికి కళ్లు తిరిగాయని అన్నారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యంపై స్థానికులు మండిపడ్డారు.