త్వరలోనే రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని అనుకుంటున్నాను!: ఖుష్బూ

  • క‌రుణానిధి, జ‌య‌ల‌లిత మ‌ర‌ణాల త‌ర్వాత  రాజ‌కీయాల్లో లోటు
  • తమిళనాడులో ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లో కింగ్ కావాలి
  • అలాంటప్పుడే ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేస్తారు
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కమల్ బాగానే రాణించారు
సినీనటులు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కమల హాసన్ ఎన్నికల్లోనూ పోటీ చేయగా రజనీకాంత్ మాత్రం రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటన మాత్రమే చేసి ఆ తర్వాత తన పార్టీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. వారిద్దరి గురించి సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బు పలు వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రులు క‌రుణానిధి, జ‌య‌ల‌లిత మ‌ర‌ణాల త‌ర్వాత  రాజ‌కీయాల్లో లోటు ఏర్ప‌డింద‌న్నారు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లో కింగ్ మేకర్ కాకూడదని, కింగ్ కావాలని ఆమె వ్యాఖ్యానించారు. అలాంటప్పుడే ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. ప్ర‌జ‌ల సంక్షేమంతో పాటు తమిళనాడు అభివృద్ధి కోసం రజనీ మ‌న‌సులో ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఇప్పటివరకు ఎవరికీ తెలియ‌దని ఆమె తెలిపారు.

రజనీకాంత్ త్వ‌ర‌లోనే రాజ‌కీయ పార్టీని ప్రారంభిస్తార‌ని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. క‌మ‌ల ‌హాస‌న్ గురించి ఆమె స్పందిస్తూ... ‌లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయన బాగానే రాణించారని చెప్పారు. ఎన్నిక‌లు ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయని ఆమె తెలిపారు.



More Telugu News