గాలిబుడగల కరపత్రాల వ్యవహారంపై కిమ్ జోంగ్ ఉన్ సీరియస్.. కీలక నిర్ణయం!
- కిమ్ సర్కారుకి వ్యతిరేకంగా వస్తోన్న గాలిబుడగలు
- పంపుతున్న కన్జర్వేటివ్ కార్యకర్తలు
- దక్షిణకొరియా మీదుగా వస్తోన్న గాలిబుడగలు
- మండిపడుతూ నిర్ణయం తీసుకున్న కిమ్
ఇకపై తమ పొరుగు దేశం దక్షిణ కొరియాతో తాము ఎటువంటి సమాచార మార్పిడి చేసుకోబోమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. అంతేకాదు, దక్షిణకొరియాతో సీమాంతర సంబంధాలు ఉండవని తెలిపే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరిహద్దుల మీదుగా వస్తున్న గాలిబుడగల కర పత్రాలను నిలువరించడంలో దక్షిణ కొరియా విఫలమైనందుకే ఉత్తరకొరియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు చెబుతున్నారు.
ఉత్తరకొరియా సర్కారుకి వ్యతిరేకంగా ఉన్న ఈ కరపత్రాలను ఆ దేశంలోని కన్జర్వేటివ్ కార్యకర్తలతో పాటు ఉత్తరం నుంచి దక్షిణ ప్రాంతంలో వచ్చి ఆశ్రయం పొందుతున్న వారు పంపుతారు. ఈ గాలి బుడగల విషయంలో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. దక్షిణ కొరియా మీదుగా వస్తోన్న వీటిని ఆ దేశం నియంత్రించలేకపోతోందని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన కార్యాలయాలను మూసివేస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. ఈ బుడగలపై ఉత్తరకొరియాలో నిషేధం ఉంది.