ఏపీలో కూడా షూటింగులకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు: మీడియాతో చిరంజీవి
- సీఎం జగన్ తో ముగిసిన టాలీవుడ్ ప్రముఖుల సమావేశం
- ఏడాదిగా సీఎంను కలవాలనుకుంటున్నామని చెప్పిన చిరంజీవి
- జగన్ తో తమ సంతోషం వెలిబుచ్చామని వెల్లడి
ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సి.కల్యాణ్, పొట్లూరి వరప్రసాద్, డి.సురేశ్ బాబు సీఎంను కలిసి అనేక అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ, ఏడాది కాలంగా సీఎం జగన్ ను కలవాలని అనుకుంటున్నామని తెలిపారు. జగన్ ను కలిసి తమ సంతోషాన్ని తెలియజేశామని వెల్లడించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపామని వివరించారు. రాష్ట్రంలో జులై 15 నుంచి సినిమాల చిత్రీకరణకు సీఎం అంగీకరించారని చిరంజీవి పేర్కొన్నారు.
అంతేకాకుండా, 2019, 2020 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ఇచ్చేందుకు కూడా అంగీకరించారని తెలిపారు. థియేటర్ల టికెట్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, సినిమా టికెట్ల జారీలో పారదర్శకత ఉండాలని కోరామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను తోడ్పడతానని ముఖ్యమంత్రి చెప్పడం ఆనందదాయకమని చిరంజీవి చెప్పారు.