'పది' పరీక్షలను రద్దు చేసిన పుదుచ్చేరి

  • ఇప్పటికే టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ ను రద్దు చేసిన తెలంగాణ, తమిళనాడు
  • అదే బాటలో పుదుచ్చేరి
  • కరోనా సంక్షోభంలో పరీక్షలు నిర్వహించలేమంటున్న రాష్ట్రాలు
కరోనా మహమ్మారిపై పోరాటంలో తలమునకలుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షల నిర్వహణను ఇప్పటి పరిస్థితుల్లో ఎంతో కష్టసాధ్యమైన విషయంగా భావిస్తున్నాయి. అందుకే తెలంగాణ ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దు చేయగా, తమిళనాడు సైతం అదేబాటలో నడిచింది. ఇప్పుడు కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పబ్లిక్ పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు తర్వాతి తరగతులకు ప్రమోట్ అవుతారని సీఎం నారాయణస్వామి వెల్లడించారు. కాగా, పుదుచ్చేరిలో ఇప్పటివరకు 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 36 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు.


More Telugu News