అదేపనిగా పబ్జీ ఆడుతూ.. మతిస్థిమితం కోల్పోయిన విశాఖ యువకుడు!
- అరకులోయ మండల కేంద్రంలో ఘటన
- ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్న యువకుడు
- చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఆన్‌లైన్ గేమ్స్‌ను అదేపనిగా ఆడితే ఎంతగా నష్టపోతామో తెలిపే మరో ఘటన ఇది. పబ్జీ గేమ్‌కు బానిసై అదేపనిగా ఆడడం వల్ల ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయిన ఘటన విశాఖలోని అరకులోయ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన కౌశిక్ అనే యువకుడు పదేపదే పబ్జీ గేమ్ ఆడేవాడు.
ఇటీవల ఆ గేమ్ ఆడుతోన్న సమయంలో ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అతడికి వైద్యులు ప్రథమ చికిత్సచేసిన అనంతరం... పబ్జీ గేమ్ వల్ల అతడు మతిస్థిమితం కోల్పోయాడని తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని సూచించారు.