పూణెలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. కోట్లాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ కరెన్సీ స్వాధీనం
- మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారంతో దాడులు
- నిందితుల్లో ఆర్మీ జవాను.. ఆర్మీ అధికారులకు అప్పగింత
- రూ. 43.4 కోట్ల విలువైన స్వదేశీ, రూ. 4.2 కోట్ల విలువైన అమెరికన్ డాలర్ల స్వాధీనం
పెద్ద ఎత్తున నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును మహారాష్ట్రలోని పూణె పోలీసులు రట్టు చేశారు. వారి నుంచి కోట్లాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారంతో దాడులు నిర్వహించినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (క్రైం) బచ్చన్ సింగ్ తెలిపారు. ముఠాలో భారత ఆర్మీ జవాను షేక్ అలీమ్ గులాబ్ ఖాన్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.
రూ.43.4 కోట్ల విలువైన స్వదేశీ నోట్లు, రూ.4.2 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు, ఓ నకిలీ పిస్టల్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే, కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారని, అదుపులోకి తీసుకున్న జవాన్‌ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించినట్టు బచ్చన్ సింగ్ వివరించారు.