గాంధీ-గాడ్సే సినిమాపై రాజుకున్న వివాదం.. కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ
- 'ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ' పేరుతో వర్మ కొత్త సినిమా
- ఫస్ట్‌లుక్‌పై బాబు గోగినేని ఆగ్రహం
- అసలు ఉద్దేశం సినిమా పూర్తిగా తీసిన తర్వాత తెలుస్తుందన్న వర్మ
- బీరు తాగి ప్రశాంతంగా ఉండాలని కౌంటర్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ' పేరుతో కొత్త సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఫస్ట్‌లుక్ కూడా ఆయన విడుదల చేశారు. గాంధీ, నాథూరామ్ గాడ్సేల ఫొటోలను ఒకటిగా కలిపి పెట్టారు. దీనిపై వివాదం ప్రారంభమైంది.
హత్యచేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తుల ఫొటోలను మార్పింగ్ చేస్తూ ఇలా పోస్టర్ విడుదల చేయడం సరికాదని సామాజిక కార్యకర్త బాబు గోగినేని అన్నారు. ఈ పోస్టర్‌ను విత్ డ్రా చేసుకోవాలని తాను రామ్ గోపాల్ వర్మను డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు. ఏమిటి ఈ అకతాయితనం? అంటూ ఆయన నిలదీశారు.
దీనిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో సమాధానం చెప్పారు. 'మార్ఫింగ్ చేసిన ఈ పోస్టర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం సినిమా పూర్తిగా తీసిన తర్వాత తెలుస్తుంది. దేవుడిని నమ్మేవారిని కించపర్చుతూ మీరు మీ హక్కుల పరిధిలోనే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో నేను కూడా నా కళాత్మక విజన్‌ను అదే విధంగా ప్రదర్శిస్తాను. సినిమాను చూడకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు మీకు లేదు. బీరు తాగి ప్రశాంతంగా ఉండమని నేను మీకు సూచిస్తున్నాను' అని వర్మ కౌంటర్ ఇచ్చారు.