నవాజ్ షరీఫ్ సోదరుడికి కరోనా పాజిటివ్.. ఇమ్రాన్ ఖానే కారణమంటూ పార్టీ ఫైర్

  • కరోనా బారిన పడుతున్న పాక్ టాప్ పొలిటీషియన్లు
  • ఇప్పటికే నలుగురు ప్రజాప్రతినిధుల మృతి
  • 1,19,536కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య
పాకిస్థాన్ టాప్ పొలిటీషియన్లు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్థాన్ ముస్లింలీగ్ (నవాజ్) పార్టీ చీఫ్ షెహ్బాజ్ షరీష్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. షెహ్బాజ్ షరీఫ్ (68)కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పార్టీ నేత అతావుల్లా తరార్ తెలిపారు. మనీలాండరింగ్ కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఈనెల 9న ఆయన హాజరయ్యారని... అప్పుడే ఆయన వైరస్ బారిన పడ్డారని చెప్పారు.

షెహ్బాజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఆయన రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉందని కోర్టుకు పలు మార్లు విన్నవించామని... అయినా విచారణకు పిలిపించారని తరార్ అన్నారు. దీనికంతటికీ ప్రధాని ఇమ్రాన్ ఖానే కారణమని మండిపడ్డారు.

పాకిస్థాన్ లో కరోనా కేసుల సంఖ్య 1,19,536కి చేరుకుంది. మొత్తం మృతుల సంఖ్య 2,356కు పెరిగింది. మృతుల్లో ఒక మంత్రి సహా నలుగురు ప్రజాప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం.


More Telugu News