పదో తరగతి పరీక్షా పత్రాలను కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

  • 11 ప్రశ్నాపత్రాల స్థానంలో 6 ప్రశ్నాపత్రాలు
  • ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కో పరీక్ష మాత్రమే
  • ఈ నిబంధన ఈ ఏడాదికి మాత్రమే పరిమితమని వెల్లడి
కరోనా నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. అయితే, ఎప్పటి మాదిరి 11 ప్రశ్నా పత్రాలను కాకుండా... వాటి సంఖ్యను ఆరుకి కుదించింది. ఒక్కో సబ్జెక్ట్ కు ఒక పరీక్షను మాత్రమే నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది.

ఆరు పేపర్ల విధానం  వల్ల 360 ప్రశ్నలు 197కు తగ్గుతాయని ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని పేర్కొంది. అయితే, ఆరు ప్రశ్నాపత్రాల విధానం కేవలం ఈ ఏడాదికి మాత్రమే పరిమితమని... వచ్చే ఏడాది యథావిధిగా 11 ప్రశ్నాపత్రాలతో పరీక్షలు జరుగుతాయిని వెల్లడించింది.


More Telugu News