అమెరికాలో మరో నల్ల జాతీయుడిని చంపేసిన పోలీసులు

  • అట్లాంటాలో ఘటన
  • రెస్టారెంటు ముందు కారు ఆపి నల్ల జాతీయుడి నిద్ర
  • పోలీసులకు రెస్టారెంటు యజమాని ఫిర్యాదు
  • తుపాకీ లాక్కొని పారిపోయేందుకు యత్నించిన నల్ల జాతీయుడు
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో మిన్నంటిన ఆందోళనలు చల్లారకముందే మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో అట్లాంటాలో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ నగర పోలీసు చీఫ్‌ రాజీనామా చేశారు. రెషార్డ్‌ బ్రూక్ ‌ అట్లాంటాలోని ఓ రెస్టారెంటు ముందు రాత్రి సమయంలో  కారును నిలిపి అందులోనే నిద్రపోయాడు.

ఈ విషయంపై పోలీసులకు ఆ రెస్టారెంట్‌ యజమాని ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు మత్తులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అతడు తిరగబడ్డాడు. అంతేగాక, ఓ పోలీసు తుపాకీని లాక్కొని పరుగులు తీశాడు. ఈ సమయంలో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడి  కాళ్లపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


More Telugu News