సుశాంత్ రాజ్ పుత్ మరణవార్తతో కుప్పకూలిన తండ్రి

  • ముంబయిలో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య
  • ఫ్యాన్ కు ఉరేసుకున్న బాలీవుడ్ హీరో
  • దిగ్భ్రాంతికి గురైన యావత్ దేశం
సుశాంత్ రాజ్ పుత్  మరణవార్తతో కుప్పకూలిన తండ్రి
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనూహ్యరీతిలో ఆత్మహత్యకు పాల్పడడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. ముంబయిలోని తన నివాసంలో సుశాంత్ ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో పోలీసులు గుర్తించారు. కాగా, సుశాంత్ తండ్రి కృష్ణకుమార్ సింగ్ పాట్నాలో నివసిస్తున్నారు. ఆయనకు ఈ మరణవార్త తెలియగానే కుప్పకూలిపోయారు. సుశాంత్ ఆత్మహత్య విషయం తెలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పాట్నా నివాసంలో సంరక్షకురాలిగా వ్యవహరిస్తున్న లక్ష్మీ దేవి వెల్లడించారు. సుశాంత్ అక్క చండీగఢ్ నుంచి పాట్నా బయల్దేరారని తెలిపారు. సుశాంత్ స్వస్థలం బీహార్ లోని పూర్ణియా జిల్లా మాల్దిహా ప్రాంతం. సినిమాలపై ఆసక్తితో ముంబయి చేరుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ డిప్రెషన్ కు లోనై బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు.


More Telugu News