సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సోషల్ మీడియాకు దూరంగా త్రిష
- రవితేజ 'క్రాక్' షూటింగ్ అప్ డేట్
- నిర్మాతగా మారుతున్న దర్శకుడు
* అందాలతార త్రిష కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా వుండాలని నిర్ణయం తీసుకుంది. 'ప్రస్తుత పరిస్థితులలో నా చుట్టూ ఏం జరుగుతోందన్నది నాకు తెలియకుండా వుండడమే మంచిదనిపిస్తోంది. అందుకే కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా వుండదలచుకున్నాను. త్వరలోనే మళ్లీ కలుద్దాం..' అంటూ త్రిష పేర్కొంది.
* రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'క్రాక్' చిత్రానికి సంబంధించి ఇక పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి వుంది. ఆగస్టులో ఈ షూటింగును నిర్వహించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.
* పవన్ కల్యాణ్ హీరోగా రూపొందే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న హరీశ్ శంకర్ త్వరలో నిర్మాతగా కూడా మారనున్నారు. గీతా ఆర్ట్స్ కు సంబంధించిన బన్నీ వాసుతో కలసి చిత్ర నిర్మాణం చేబట్టడానికి హరీశ్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.