ఫేస్ మాస్కుల విషయంలో.. అమెరికా విమానయాన సంస్థల కీలక నిర్ణయం!
- మాస్క్ ధరించకుంటే ‘నో ఫ్లై’ జోన్‌లోకి
- ఆహారం తీసుకునేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు మాస్క్ తీయొచ్చు
- విమానం ఎక్కడానికి ముందే హామీ ఇవ్వాలి
విమాన ప్రయాణాలపై అమెరికా విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై మాస్క్ ధరించని ప్రయాణికులను ‘నో ఫ్లై’ జాబితాలోకి చేర్చాలని నిర్ణయించాయి. ఈ మేరకు అలస్కా ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, హవాయిన్ ఎయిర్‌లైన్స్, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లు పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంలో కొన్ని సడలింపులు కూడా ఇచ్చాయి. ఆహారం తీసుకునేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు మాత్రం మాస్కులు తొలగించుకోవచ్చని పేర్కొన్నాయి. విమానం ఎక్కడానికి ముందే ఫేస్ మాస్క్ ధరిస్తామని ప్రయాణికులు హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆయా విమానయాన సంస్థలు తెలిపాయి.