దక్షిణకొరియాపై దాడికి సిద్ధంగా ఉన్నాం: ఉత్తరకొరియా

  • కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా
  • ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న సైన్యం
  • యుద్ధ హెచ్చరికలు జారీ చేసిన కిమ్ జాంగ్ సోదరి
దక్షిణకొరియాపై ఉత్తరకొరియా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉత్తరకొరియా దుందుడుకు చర్యల వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దక్షిణకొరియా నుంచి తమ భూభాగంలోకి బెలూన్ల ద్వారా సందేశాలు వస్తే దాడి తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ సందర్భంగా కొరియా ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

రెండు రోజుల క్రితం కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ఎలాంటి సంకేతం ఇచ్చినా నేరుగా ఆర్మీ చీఫ్ చేతిలోకి వెళ్లిపోతుందని ఆమె చెప్పారు. శత్రుదేశం దక్షిణకొరియాపై తదుపరి చర్యలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పానని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.


More Telugu News