హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కోవిడ్ మరణాలను అడ్డుకోలేదు: శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్

  • హైడ్రాక్సీ క్లోరోక్విన్ గేమ్ చేంజర్ కాదు
  • మానవ ప్రయోగాల్లో అది తేలిపోయింది
  • ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్
కరోనా వైరస్ మరణాలకు అడ్డుకట్ట వేసే శక్తి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు లేదని స్పష్టమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా వైరస్ తాజా ఔషధ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన డాక్టర్ సౌమ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

 అలాగే, ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పదిమందిపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు చెప్పారు. పదిమందిలో ముగ్గురు ప్రయోగం మూడో దశకు చేరుకున్నట్టు చెప్పారు. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించినట్టుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ గేమ్ చేంజర్ కాదని, కరోనా మరణాలను అడ్డుకునే శక్తి దానికి లేదని మానవ ప్రయోగాల్లో స్పష్టమైందని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.


More Telugu News