తెలంగాణలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల శాతం!
- టెస్టుల సంఖ్య పెంచుతుంటే పెరుగుతున్న కేసులు
- గత రెండు రోజుల్లో ప్రతి ఐదు టెస్టుల్లో ఓ కొత్త కేసు
- అధికారుల్లో తీవ్ర ఆందోళన
తెలంగాణలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. ప్రతి 100 టెస్టుల్లో 14 పాజిటివ్ లు వస్తున్నాయంటే, వైరస్ ఎంతగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ప్రతి 100 పరీక్షల్లో 6.11 శాతం పాజిటివ్ రేట్ ఉండగా, తెలంగాణలో అది 14.39 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 28 నుంచి ఈ రేటు భారీగా పెరుగుతోంది.
ఏప్రిల్ 28 నాటికి తెలంగాణలో 5.2 శాతంగా ఉన్న టీపీఆర్ (టెస్ట్ పాజిటివ్ రేట్), ఆపై మే 14 నాటికి 6.07 శాతానికి చేరుకుంది. ఆ తరువాత జూన్ 16కు 12.6 శాతానికి పెరిగి, ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది. రాష్ట్రంలో వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని, ఇటీవల టెస్టుల సంఖ్యను మరింతగా పెంచడంతో భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
గత వారం రోజుల్లో టెస్టులు, పాజిటివ్ లను పరిశీలిస్తే, 16న 1,251 టెస్టులు జరుగగా, 213 (17.02 శాతం) కేసులు వచ్చాయి. ఆపై 17న 1,096 టెస్టులకు గాను 269 (24.54 శాతం), 19న 2,477 టెస్టులకు గాను 499 (20.14 శాతం), జూన్ 20న 3,188 టెస్టులకు గాను 546 (17.12 శాతం) కేసులు వచ్చాయి. 21న 3,297 టెస్టులు చేస్తే 730 కేసులు (22.14 శాతం), 22న 3,189 టెస్టులు జరిపితే 872 (27.34 శాతం) కొత్త కేసులు వచ్చాయి. టెస్టుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే, కేసుల సంఖ్య పెరగడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.