టీఎస్ పోలీస్ అకాడమీలో మొక్కలను నాటేందుకు వందలాది చెట్ల నరికివేత!

  • టీఎస్ పోలీస్ అకాడమీలో హరితహారం
  • మామిడి మొక్కలు నాటేందుకు చెట్లను తొలగించిన వైనం
  • భవిష్యత్తులో ఆదాయం పెంచుకోవచ్చన్న ఆలోచనే దీనికి కారణం
ఓ పోలీసు ఉన్నతాధికారి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం అభాసుపాలైంది. తెలంగాణ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న ఘటన గురించి తెలుకున్నవారంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, హరితహారంలో భాగంతో మొక్కలను నాటేందుకు వందలాది చెట్లను నరికేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా అకాడమీలో మామిడి మొక్కలను నాటిస్తే భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఓ ఉన్నతాధికారికి ఐడియా వచ్చింది. వెంటనే తన నిర్ణయాన్ని అమలు చేశారు. దీంతో, ఇప్పటికే అక్కడున్న చెట్లను నరికించి... వాటి స్థానంలో మామిడి చెట్లను నాటించారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను క్యాడెట్లకు అప్పగించారు.


More Telugu News