పతంజలికి ఊరట... మందు అమ్ముకోవచ్చు కానీ... కేంద్రం షరతులు!

  • వారం రోజుల్లో కరోనా తగ్గుతుందని ప్రచారం
  • కరోనాకు విరుగుడనిగానీ, నయం చేస్తుందనిగానీ ప్రచారం చేయరాదు
  • కేవలం రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధమే
  • అమ్మకాలకు ఆయుష్ మంత్రిత్వ శాఖ పచ్చజెండా
వారం రోజుల్లో కరోనాను తగ్గించే ఔషధాన్ని కనిపెట్టామంటూ మీడియా ముఖంగా ప్రకటించి అభాసుపాలైన పతంజలి సంస్థకు కాస్తంత ఊరట లభించింది. 'కరోనిల్' పేరిట పతంజలి సంస్థ తయారు చేసిన మందును కేవలం రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా మాత్రమే ప్రచారం చేసుకుని అమ్ముకోవచ్చని పేర్కొంది.

అయితే, ఇది కరోనాకు విరుగుడుగా పనిచేస్తుందని గానీ, నయం చేస్తుందని గానీ ప్రచారం చేయరాదని కేంద్రం షరతు విధించింది. ఈ మేరకు 'కరోనిల్' అమ్మకాలకు పచ్చజెండా ఊపిన ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇది కరోనాకు ఔషధం కాదని స్పష్టం చేసింది. తమ షరతులకు అంగీకరిస్తూ, లిఖితపూర్వక హామీని ఇచ్చిన తరువాతనే కరోనిల్ ను మార్కెట్లోకి విడుదల చేయాలని స్పష్టం చేసింది.


More Telugu News