హైదరాబాద్‌లో దారుణం.. ఫీవర్ ఆసుపత్రి మహిళా డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆసుపత్రి.. వీడియో ఇదిగో
- కొవిడ్ లక్షణాలతో చాదర్‌ఘాట్‌లోని ఆసుపత్రిలో చేరిన సుల్తానా
- తుంబై ఆసుపత్రిలో 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు
- అంత బిల్లు ఎందుకని అడిగినందుకు నిర్బంధించారన్న డీఎంవో
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వైరస్ లక్షణాలతో వచ్చిన వారి నుంచి ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. ఇప్పటికే ఇటువంటి పలు ఘటనలు దేశ వ్యాప్తంగా పలు చోట్ల బయట పడ్డాయి. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తాజాగా ఇలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది.
తనను హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లోని తుంబై ఆసుపత్రిలో నిర్బంధించారంటూ హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కొవిడ్-19 లక్షణాలతో తాను ఈ ఆసుపత్రిలో చేరానని, అయితే, 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు వేశారని సెల్ఫీ వీడియోలో ఆమె కన్నీరు కార్చుతూ తెలిపారు. అంత బిల్లు ఎందుకని అడిగినందుకు ఆ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.