ఆసియా దేశాల్లో వరుస భూకంపాలు.. ఇండోనేషియాలో నేలమట్టమైన భవనాలు

  • ఇండోనేషియా, సింగపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపాలు
  • రెండుచోట్ల 6 దాటిన భూకంప తీవ్రత
  • అరుణాచల్‌ప్రదేశ్‌లో 3.4 తీవ్రతతో ప్రకంపనలు
వరుస భూకంపాలతో ఆసియాలోని పలు దేశాలు వణికిపోయాయి. తొలుత ఇండోనేషియాలోని ఉత్తర సెమరాంగ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.6గా నమోదైంది. జావా ద్వీపంలోని బాటాంగ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమైనట్టు తెలుస్తోంది.

అలాగే, ఆగ్నేయ సింగపూర్‌లోనూ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. మరోపక్క, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోనూ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి స్వల్పంగా కంపించింది. సుమారు ఒంటి గంట ప్రాంతంలో తవాంగ్ సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైనట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.


More Telugu News