కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతానికి వలసొచ్చిన అరుదైన పక్షి!

  • వలసొచ్చిన గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్‌ పక్షి
  • నందిగాం అటవీ ప్రాంతంలో గుర్తింపు
  • తెలంగాణకు వలస ఇదే తొలిసారి
తెలంగాణలోని కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి కనిపించింది. దీనిని గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ అనే అరుదైన పక్షిగా గుర్తించారు. పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షించేలా ఉన్న ఈ పక్షి జిల్లాలోని పెంచికల్‌పేట మండలం నందిగాం అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట ప్రాంతంలో కనిపించింది.

దీనిని గుర్తించిన స్థానిక అటవీ అధికారులు వెంటనే దానిని కెమెరాల్లో బంధించారు. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు.


More Telugu News