పదవుల నుంచి సచిన్ పైలట్ తొలగింపు.. కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్ణయం
- డిప్యూటీ సీఎం పదవి నుంచి ఉద్వాసన
- మరో ఇద్దరు మంత్రులపైనా వేటు
- ప్రకటించిన రణదీప్ సూర్జేవాలా
రాజస్థాన్ రాజకీయాల్లో సంక్షోభానికి కారణమై, పార్టీ అధిష్ఠానాన్ని ఇరకాటంలో పడేసే చర్యలకు దిగిన యువనేత, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పై కాంగ్రెస్ ప్రత్యక్ష చర్యలకు దిగింది. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించడమే కాకుండా, రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా ఆయనను తప్పిస్తున్నట్టు వెల్లడించింది. పైలట్ నే కాదు, ఆయన పక్షాన నిలిచిన ఇద్దరు మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి తప్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు.
అశోక్ గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం రాజుకుంది. దీనిపై చర్చించేందుకు సీఎల్పీ రెండు పర్యాయాలు సమావేశమైంది. సీఎల్పీ భేటీకి రావాలంటూ రెండుసార్లు ఆహ్వానించినా సచిన్ పైలట్ నుంచి జవాబు రాకపోవడంతో ఆయనను సాగనంపడమే మంచిదని పార్టీ తీర్మానించింది. సచిన్ పైలట్ పై వేటు వేసే తీర్మానానికి సభ్యులందరూ ముక్తకంఠంతో సరేననడంతో అధిష్ఠానం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.
దీనిపై రాష్ట్ర గవర్నర్ కు నివేదించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్లారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ను, మరో ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ కు తెలియజేశారు.