కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లకు కొరటాల శివ విన్నపం!
- వైరస్ సోకిన కొందరు ఆ విషయాన్ని దాస్తున్నారు
- అసలు విషయాన్ని సన్నిహితులకు తెలియజేయాలి
- దీంతో వారంతా టెస్టులు చేయించుకుంటారు
కరోనా పాజిటివ్ పేషెంట్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ అన్నారు. వైరస్ సోకిన కొందరు వ్యక్తులు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారని... ఇది చాలా దారుణమైన విషయమని చెప్పారు. ఇలాంటి వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని... తమ సన్నిహితులకు, తమకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారికి అసలు విషయాన్ని తెలియజేయాలని... దీంతో, వారంతా కరోనా పరీక్షలు చేయించుకుంటారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులల్లో కరోనా పేషెంట్లంతా ఈ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మనమంతా నాగరిక ధోరణితో వ్యవహరించాల్సిన సమయం ఇదని అన్నారు. కరోనా సోకిన విషయాన్ని దాయడం వల్ల... మహమ్మారిని కట్టడి చేయడం కష్టమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా విన్నవించారు.
మనమంతా నాగరిక ధోరణితో వ్యవహరించాల్సిన సమయం ఇదని అన్నారు. కరోనా సోకిన విషయాన్ని దాయడం వల్ల... మహమ్మారిని కట్టడి చేయడం కష్టమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా విన్నవించారు.