300 మిలియన్ల వ్యూస్ వచ్చిన తొలి భారతీయ సినిమాగా బన్నీ మూవీ

  • సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్‌ రికార్డు
  • సినిమా ఆల్‌ టైమ్ రికార్డు సృష్టించిందన్న అనలిస్ట్‌ కమల్‌నాథ్‌
  • 2016లో విడుదలైన సరైనోడు  
అల్లు అర్జున్‌ నటించిన సరైనోడు సినిమా యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హిందీ సినిమాలు కూడా ఈ స్థాయిలో వ్యూస్ దక్కించుకోలేకపోయాయి. ఈ విషయాన్ని తెలుపుతూ అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్వీట్ చేశారు. ఈ సినిమా ఆల్‌ టైమ్ రికార్డు సృష్టించిందని, 300 మిలియన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచిందని పేర్కొన్నారు.

ఇక సరైనోడు సినిమా 2016లో విడుదలైంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్‌ నటించారు. ఆది పిని శెట్టి ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో నటించాడు. ఈ సినిమాను అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలోని బన్నీ మాస్‌ యాక్షన్, డ్యాన్స్‌‌ ప్రేక్షకులను అలరించింది. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.


More Telugu News