మరోసారి పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్ రెడ్డి!
- ప్రైవేటు బస్సుల విషయంలో అవకతవకలు
- 7 గంటల కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి
- జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఓర్వకల్లులోనూ కేసు
మాజీ ఎమ్మెల్యే, ఇటీవల ప్రైవేటు బస్సుల విషయంలో అవకతవకలపై అరెస్టయి, ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోమారు కస్టడీకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించేందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కోర్టు అనుమతి కోరగా, న్యాయమూర్తి 7 గంటల పాటు ప్రశ్నించేందుకు అనుమతించారు.
దీంతో ఆయన్ను జైలు నుంచి పోలీసు అధికారులు తీసుకుని వెళ్లారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఓర్వకల్లు పీఎస్ లో కూడా ఓ కేసు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పోలీసులు కస్టడీ కోరగా, కోర్టు అనుమతించింది. నేటి సాయంత్రం కస్టడీ సమయం ముగిసిన తరువాత తిరిగి ఆయన్ను కడప కేంద్ర కారాగారానికి తరలించనున్నారు.