నితిన్, షాలిని పెళ్లి తేదీ ఇదే!
- ప్రియురాలిని పెళ్లాడుతున్న నితిన్
- ఫిబ్రవరిలో ముగిసిన పసుపు, కుంకుమ ఫంక్షన్
- జూలై 26 రాత్రి పెళ్లి వేడుక
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు షాలినిని పెళ్లాడబోతున్నాడు. ఫిబ్రవరిలోనే వీరి పసుపు, కుంకుమ ఫంక్షన్ ముగిసింది. పెళ్లిని చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. అయితే కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఇప్పట్లో కరోనా తగ్గే సూచనలు కనపడకపోవడంతో.. కోవిడ్ నిబంధనలకు లోబడి పెళ్లి జరిపించాలనే నిర్ణయానికి వచ్చారు. జూలై 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు హైదరాబాదులో వివాహాన్ని జరిపిస్తున్నట్టు ప్రకటించారు. కుటుంబసభ్యులతో పాటు అతికొద్ది మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించనున్నారు.