యనమల ఇచ్చిన సలహాలను గవర్నర్ కార్యాలయం పరిశీలించాలి: దేవినేని ఉమ
- గవర్నర్ బిల్లులను రాష్ట్రపతికి నివేదించాలన్న ఉమ
- అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని సూచన
- కేంద్రం చేసిన చట్టాన్ని సీఎం పట్టించుకోవడంలేదని విమర్శలు
రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్పందించారు. సీఆర్డీయే రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు అంశంలో తమ పార్టీ నేత యనమల రామకృష్ణుడు ఇచ్చిన సలహాలను గవర్నర్ కార్యాలయం పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్... రాష్ట్రపతికి నివేదించాలని అన్నారు. బిల్లుల విషయలో అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం చేసిన చట్టాన్ని సీఎం జగన్ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 14 నెలల్లో సీఎం ఒక్కసారి కూడా అమరావతి పేరు ఎత్తలేదని తెలిపారు. ఓవైపు కరోనాతో ప్రజలు చనిపోతుంటే సీఎం తాడేపల్లి దాటి రావడంలేదని విమర్శించారు.