చిరంజీవి చిత్రానికి దర్శకుడిగా వీవీ వినాయక్?

  • 'లూసిఫర్' స్క్రిప్టుపై వర్క్ చేసిన సుజీత్ 
  • అసంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి 
  • కొత్తగా వీవీ వినాయక్ కి బాధ్యతలు 
మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేయడానికి గత కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి 'సాహో' ఫేం సుజీత్ ని మొదట్లో దర్శకుడిగా ఎంచుకున్నారు. గత కొన్నాళ్లుగా అతను ఈ స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నాడు. అయితే, సుజీత్ పనితనం పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారనీ, దాంతో ఆయనని ఈ ప్రాజక్టు నుంచి తప్పించారనీ రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను చేస్తున్న 'ఆచార్య' తర్వాత బాబీ దర్శకత్వంలో చేయనున్న చిత్రాన్ని ముందుకు తెచ్చారని కూడా అంటున్నారు. మరోపక్క, 'లూసిఫర్' ప్రాజక్టుకి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ను తీసుకుంటున్నట్టుగా తాజాగా ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో వాస్తవం ఎంతన్నది త్వరలో తెలుస్తుంది.  


More Telugu News