వైయస్ వివేకాను హత్య చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన సీబీఐ అధికారులు

  • వివేకా కుమార్తె సునీతతో మాట్లాడిన అధికారులు
  • పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో రికార్డుల పరిశీలన
  • కీలక అనుమానితులను ప్రశ్నించనున్న సీబీఐ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే కడప జిల్లా ఎస్పీ, సిట్ అధికారులను కలిసి వివరాలను తెలుసుకున్న సీబీఐ అధికారులు... వివేకాను హత్య చేసిన ప్రదేశాన్ని ఈరోజు పరిశీలించారు.

ఈ సందర్భంగా వివేకా కుమార్తె సునీత కూడా అక్కడే ఉన్నారు. వివేకాను హత్య చేసిన బెడ్ రూమ్, బాత్ రూమ్ ను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సునీతతో మాట్లాడి వారు వివరాలను తెలుసుకున్నారు.

అంతేకాకుండా ఈ ఉదయం పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో కూడా కేసు రికార్డులను సీబీఐ అధికారులు పరిశీలించారు. రానున్న రెండు రోజుల్లో కీలక అనుమానితులను సీబీఐ ప్రశ్నించనున్నట్టు సమాచారం.


More Telugu News