కరోనా కట్టడిలో మోదీ ఈ 'ఆరు విజయాలు' సాధించారు: రాహుల్ గాంధీ ఎద్దేవా
- ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్' నిర్వహించారు
- మార్చిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చారు
- ఏప్రిల్లో ప్రజలతో కొవ్వొత్తులు వెలిగింపజేశారు
- మేలో ఎన్డీఏ ప్రభుత్వ ఆరో వార్షికోత్సవం జరుపుకున్నారు
కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ ఆరు విజయాలు సాధించారంటూ ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు.
''కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మోదీ సాధించిన విజయాలు..
* ఫిబ్రవరి-నమస్తే ట్రంప్
* మార్చి-మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చడం
* ఏప్రిల్- ప్రజలతో కొవ్వొత్తులు వెలిగింపజేయడం
* మే-ఎన్డీఏ ప్రభుత్వ ఆరో వార్షికోత్సవం జరుపుకోవడం
* జూన్- బిహార్ అసెంబ్లీ ఎన్నికల వర్చువల్ ర్యాలీలు నిర్వహించడం
* జూలై- రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేయడం
అందుకే కరోనాపై పోరాటం చేయడంలో దేశ ప్రజలు తమపై తామే ఆధారపడ్డారు'' అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.