భారత్ తో ఆడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనన్న పాక్ క్రికెట్ బోర్డ్
- భారత్, పాక్ ల మధ్య చాలా ఏళ్లుగా జరగని సిరీస్ లు
- 2013లో ఇండియా పర్యటనకు వచ్చిన పాకిస్థాన్
- భారత్ సిద్ధంగా ఉంటే తాము రెడీ అన్న పీసీబీ చైర్మన్
భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగి చాలా ఏళ్లు అయింది. లిమిటెడ్ ఓవర్లకు సంబంధించి 2013లో చివరి సిరీస్ జరిగింది. అప్పుడు భారత్ పర్యటనకు పాకిస్థాన్ వచ్చింది. ఆ సందర్భంగా 3 వన్డేలు, రెండు టీ20లు ఆడారు. ఇక టెస్టుల విషయానికి వస్తే 2007-08 సీజన్ లో చివరి మ్యచ్ జరిగింది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లను భారత్ ఆపేసింది. కేవలం ప్రపంచ కప్, ఆసియాకప్ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి మాట్లాడుతూ, భారత్ తో ఆడటానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. అయితే ఈ విషయంలో తాము భారత్ వెంట పరుగెత్తమని తెలిపారు. తమతో ఆడేందుకు భారత్ సిద్ధంగా ఉంటే... తాము స్పందిస్తామని చెప్పారు.