2018 ఆసియా గేమ్స్ లో భారత్ సాధించిన సిల్వర్ మెడల్... ఇప్పుడు గోల్డ్ మెడల్ గా మారిన వైనం!
- జకార్తాలో జరిగిన గేమ్స్
- స్వర్ణం సాధించిన టీమ్ ఆటగాడిపై నిషేధం
- భారత బృందానికి మెడల్ ప్రమోషన్
2018లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్ లో 4/400 మిక్స్ డ్ రిలేలో భారత బృందం సాధించిన సిల్వర్ మెడల్, ఇప్పుడు గోల్డ్ మెడల్ గా మారింది. నాటి పోటీల్లో ఇండియాకు చెందిన మెహమ్మద్ అనస్, కరోకియా రాజీవ్,హిమా దాస్, పూనమ్మలతో కూడిన బృందం3.15.71 సెకన్లతో రెండో స్థానంలో నిలువగా, బహ్రెయిన్ బృందం 3.11.89 సెకన్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
అయితే, తాజాగా బహ్రెయిన్ జట్టులోని కెమీ అడికోయా డోపింగ్ టెస్టులో పట్టుబడగా, అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. దీంతో నాడు పతకాన్ని సాధించిన బహ్రెయిన్ టీమ్ డిస్ క్వాలిఫై కాగా, వారు సాధించిన స్వర్ణం భారత్ వశమైంది. ఇక ఇదే సమయంలో మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో కాంస్యం సాధించిన అథ్లెట్ అడెకోయాపైనా నిషేధం పడగా, ఆ పోటీలో నాలుగో స్థానంలో నిలిచిన భారత క్రీడాకారిణి అను రాఘవన్ కు కాంస్యం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.