'మై డియర్ బ్రదర్ తారక్' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- కేటీఆర్కు రాజకీయ, సినీ ప్రముఖుల విషెస్
- ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్ష
- సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లు
తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'మై డియర్ బ్రదర్ తారక్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని దేవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్, 'చాలా ధన్యవాదాలు అన్నా' అంటూ ట్వీట్ చేశారు.
మరోపక్క, జనసేన అధినేత పవన్ కల్యాణ్, 'పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ బ్రదర్ శ్రీ కేటీఆర్.. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని చిల్కూరు బాలాజీని ప్రార్థిస్తున్నాను' అని చెప్పారు.
'హ్యాపీ బర్త్ డే కేటీఆర్.. అందరికీ స్ఫూర్తివంతమైన మీ నాయకత్వం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని సినీనటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.
'పేదింటికి చిరునవ్వు.. నేతన్న కంటిచూపు.. భాగ్యనగరం బాద్షా.. ఐటీ సూటేసిన.. రాజనీతి రాకెట్టు..అదరక బెదరక విశ్వవేదికలపై తెలంగాణ వాడిని వేడిని చాటిన ఉద్యమసేనాని.. తండ్రికి తగ్గ తనయుడు.. సిరిసిల్ల శ్రీమంతుడు.. అన్న కల్వకుంట్ల తారకరాముడికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్వీట్ చేశారు. వీరితో పాటు కేటీఆర్కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.