నా హృదయం బద్దలైపోతోంది: కృతి సనన్
- సుశాంత్ సింగ్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా'
- ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబడుతున్న చిత్రం
- తెరపై నిన్ను చూసి ఆవేదనకు గురయ్యానన్న కృతి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఈ సినిమా విడుదల కావడంతో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా గురించి సుశాంత్ మాజీ ప్రియురాలు, సినీ నటి కృతి సనన్ స్పందించింది. సోషల్ మీడియా ద్వారా భావోద్వేగమైన పోస్టు పెట్టింది. 'తెరపై నిన్ను చూసి చాలా ఆవేదనకు గురయ్యాను. నా హృదయం బద్దలైపోతోంది. నీవు తిరిగి వచ్చావనిపించింది. అద్భుతంగా నటించావు. తెరపై మేజిక్ చేశావు' అని స్పందించింది.