మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై నారా లోకేశ్ స్పందన!
- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదం
- ప్రజల ఆకాంక్షలకు కోర్టుల్లో న్యాయం జరుగుతుంది
- అమరావతిని పరిరక్షించుకు తీరుతాం
మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.