అబ్బే.. నా ఉద్దేశం అది కాదు: ఎన్నికల వాయిదాపై ట్రంప్
- ఎన్నికలను వాయిదా వేయాలన్న ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు
- అవకతవకలు జరగొచ్చన్నదే తన అభిప్రాయమంటూ మరో ట్వీట్
- మూడు నెలల తర్వాత ఆ విషయం తెలిస్తే ఇబ్బందిగా ఉంటుందన్న అధ్యక్షుడు
ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని వాయిదా వేయడమే మంచిదంటూ అధ్యక్షుడు ట్రంప్ గురువారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎందుకంటే 1788లో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడూ వాయిదా పడలేదు. నవంబరు 3నే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అటు ప్రతిపక్ష డెమొక్రాట్లతోపాటు ఇటు సొంతపార్టీ రిపబ్లిక్ నేతలకు కూడా మింగుడుపడడం లేదు. ఫలితంగా ట్రంప్‌ను విమర్శలు చుట్టుముట్టాయి.
అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురుస్తుండడంతో ట్రంప్ సర్దుకున్నారు. అధ్యక్ష ఎన్నికలపై నిన్న మరో ట్వీట్ చేస్తూ తన ఉద్దేశం అదికాదని అన్నారు. మెయిల్ ద్వారా జరిగే ఎన్నికల్లో అవకతవకలు జరగొచ్చన్న అనుమానాన్ని మాత్రమే తాను వ్యక్తం చేశానని అన్నారు. అవకతవకల విషయం మూడు నెలల తర్వాత తెలిస్తే దేశం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగా అప్రమత్తం చేశానని ట్రంప్ వివరణ ఇచ్చారు. సొంత పార్టీ నుంచే తనకు వ్యతిరేకత రావడంతో ట్రంప్ ఈ విషయంలో వెనక్కి తగ్గారని అంటున్నారు.