ఎల్‌వీ ప్రసాద్ మనవడిపై పోలీసులకు ఇళయరాజా ఫిర్యాదు
- ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌లోకి ప్రవేశించారని ఫిర్యాదు
- పలు పరికరాలను ధ్వంసం చేశారని ఆరోపణ
- తనపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య
- చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఎల్‌వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి, అతడి అనుచరులు ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌లోకి ప్రవేశించి సంగీత వాయిద్యాలతో పాటు ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.
ప్రసాద్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు ఎల్వీ ప్రసాద్ తనపై గౌరవంతో స్టూడియోలో ఇచ్చిన ప్రత్యేకమైన గది ఉన్న స్టూడియో స్థలం గురించి వివాదం రాజుకున్న నేపథ్యంలో తాను సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. అయితే, ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే తనపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, బలవంతంగా స్టూడియోలోని ఆ స్థలాన్ని లాక్కోవాలనుకుంటున్నారని ఆయన చెప్పారు.
సాయి ప్రసాద్‌తో పాటు అతడి అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా కోరారు. కాగా, ఇళయరాజాకు ఎల్వీ ప్రసాద్ ఇచ్చిన రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దీనిపై ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేశ్ ప్రసాద్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. మనవడు సాయి ప్రసాద్ మాత్రం దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు జరుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తనను బెదిరిస్తున్నారంటూ ఇళయరాజా సాయి ప్రసాద్‌పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.