మూడు రాజధానులపై రేపు పవన్ కల్యాణ్ కీలక సమావేశం!
- మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదంతో వేడెక్కిన రాజకీయం
- పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో చర్చించనున్న పవన్
- భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన వెలువడే అవకాశం
మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఆగస్టు 15వ తేదీన విశాఖ రాజధానికి శంకుస్థాపన చేసే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై నిరసన కార్యక్రమాలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, జనసేన రేపు కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది.
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో మూడు రాజధానులపై నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అమరావతి రైతులకు జనసేన అండ ఎలా ఉండాలనే విషయంపై కూడా చర్చలు జరపనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.