క‌రోనా తీవ్ర‌త పెర‌గ‌కుండా చేస్తున్న‌ బీసీజీ టీకా.. ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

  • నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్ ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నం
  • వాలంటీర్ల‌లో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు ప‌రిశీలన‌
  • కరోనా సోకినప్ప‌టికీ అనారోగ్యం బారిన పడని వాలంటీర్లు
బాసిల్లె కాల్మెటె-గ్వెరిన్‌ (బీసీజీ) టీకా వేయించుకున్న వారు కరోనా సోకినప్ప‌టికీ అనారోగ్యం బారిన పడట్లేదని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఆ టీకా వేయించుకున్న వారితో పాటు వేయించుకోని వారిపై ప‌రిశోధ‌న‌లు చేసిన అనంత‌రం నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్‌ విశ్వవిద్యాలయ ప‌రిశోధ‌కులు ఫ‌లితాలు వెల్ల‌డించారు. టీకా వేయించుకున్న వారు తీవ్రంగా అనారోగ్యం పాలైనట్లు త‌మ‌కి ఎక్క‌డా కనిపించ లేదని తేల్చిచెప్పారు. అలాగే, క‌రోనా  బారిన పడే ముప్పును ఆ టీకా పెంచుతున్న పరిస్థితులేవీ లేవని తెలిపారు.

క్షయ బారిన ప‌డ‌కుండా బీసీజీ  టీకా వేస్తార‌న్న విష‌యం తెలిసిందే. ఈ టీకా చాలా సురక్షితమైంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. త‌మ అధ్య‌య‌నంలో భాగంగా ఐదేళ్ల క్రితం బీసీజీ టీకా వేసుకున్న వారి ఆరోగ్య ప‌రిస్థితితో పాటు ఆ టీకా వేయించుకోని వారిని క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప‌రిశీలించామ‌ని వెల్ల‌డించారు. ఆ వాలంటీర్ల‌లో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును ప‌రిశీలించి ఈ ఫ‌లితాలు చెబుతున్న‌ట్లు వివ‌రించారు.


More Telugu News