తెలంగాణలో 80 వేలు దాటిన కరోనా కేసులు
- కొత్తగా 1,256 మందికి కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751
- ఆసుపత్రుల్లో 22,528 మందికి చికిత్స
- కోలుకున్న 57,586 మంది
తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 80 వేలను దాటింది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,256 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,587 మంది కోలుకోగా, 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. ఆసుపత్రుల్లో 22,528 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 57,586 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 637కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 389 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు నమోదయ్యాయి. .
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. ఆసుపత్రుల్లో 22,528 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 57,586 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 637కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 389 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు నమోదయ్యాయి.