బీరుట్ పేలుళ్ల ఎఫెక్ట్.. నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న ప్రభుత్వం

  • బీరుట్‌లో పేలుళ్ల ఘటనలో 160 మంది మృతి 
  • నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం
  • మంత్రివర్గ రాజీనామాలను సమర్పించిన ప్రధాని దియాబ్
బీరుట్ పేలుళ్ల ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ రాజీనామా చేశారు. నిన్న నేరుగా అధ్యక్ష భవనానికి చేరుకున్న దియాబ్ మంత్రివర్గ రాజీనామాలను అందజేశారు. లెబనాన్ రాజధాని అయిన బీరుట్‌లో గత మంగళవారం జరిగిన భారీ పేలుళ్ల ఘటనలో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 వేల మందికిపైగా గాయపడ్డారు. పేలుడు దెబ్బకు బీరుట్ వణికిపోయింది. పోర్టు మొత్తం ధ్వంసమైంది.

ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో తలొగ్గిన ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి తప్పుకుంది. మంత్రివర్గ సమావేశానికి ముందే ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా, తాజాగా మొత్తం మంత్రివర్గం రాజీనామా చేసిన పత్రాలను ప్రధాని దియాబ్ అధ్యక్షుడికి అందించారు. ప్రధాని, ఆయన కేబినెట్ మంత్రుల రాజీనామాలను అధ్యక్షుడు మైఖేల్ ఔన్ ఆమోదించారు. కొత్త కేబినెట్ ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు.


More Telugu News