సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామం: నారా లోకేశ్
- ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన వాటా ఉంటుందంటూ సుప్రీం తీర్పు
- అందరి కంటే ముందే ఆడబిడ్డలకు ఎన్టీఆర్ సమాన హక్కును కల్పించారన్న లోకేశ్
- మహిళలను జగన్ మోసం చేస్తున్నారు
తల్లిదండ్రుల ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమాన వాటా ఉంటుందంటూ సుప్రీంకోర్టు నిన్న చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... కుమార్తెకు ఆస్తిపై సమాన హక్కు పుట్టుకతోనే వస్తుందని సుప్రీంకోర్టు తీర్పును వెలవరించడం శుభపరిణామనని చెప్పారు.
అయితే, దేశంలో అందరి కంటే ముందే ఆస్తిలో ఆడబిడ్డకు సమాన హక్కును కల్పించి చైతన్య సారథిగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతను ఇచ్చింది టీడీపీ మాత్రమేనని చెప్పారు. కార్యరూపం దాల్చని చట్టాల పేరు చెపుతూ ముఖ్యమంత్రి జగన్ మహిళలను మోసం చేస్తున్నారని అన్నారు. దీంతోపాటు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో స్త్రీలకు ఆస్తిలో సమాన వాటా బిల్లును ప్రతిపాదించిన వార్తకు సంబంధించిన వార్తను షేర్ చేశారు.