కమలా హారిస్ ఎంట్రీతో మారిపోయిన సీన్... ఒక్కరోజులోనే భారీగా విరాళాలు!
- 24 గంటల్లో దాదాపు 26 మిలియన్ డాలర్ల విరాళాలు
- కమలా హారిస్ ను వైస్ ప్రెసిడెంట్ గా ప్రకటించడమే కారణం
- గతంలో సమీకరించిన ఒకరోజు అత్యధికంతో పోలిస్తే రెట్టింపు
ఈ సంవత్సరం నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ను ఎంచుకున్నట్టు జో బిడెన్ ప్రకటించగానే, ఆయన ప్రచారం నిమిత్తం విరాళాలు వెల్లువలా వచ్చాయి. తనతో పాటు కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీలో ఉంటారని రెండు రోజుల క్రితం బిడెన్ ప్రకటించారు. ఆ వెంటనే ఒకరోజు వ్యవధిలో దాదాపు 26 మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయి. గతంలో సమీకరించిన అత్యధిక ఒకరోజు మొత్తం కంటే, ఇది రెట్టింపు కావడం గమనార్హం.
ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని డెమోక్రాట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. కమలా హారిస్ ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థినిగా ప్రకటించడమే ఇందుకు కారణమని సమాచారం. ఆది నుంచి పార్టీకి కంచుకోటగా ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో కమలా హారిస్ కు గట్టి మద్దతుంది. అక్కడి వ్యాపారులు, ప్రముఖులు పార్టీకి భారీగా విరాళాలు ఇస్తుంటారు. పైగా ఆమెకు భారత్, ఆఫ్రికన్ మూలాలు ఉండటం కలిసొస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.