జమ్మూ కశ్మీర్ నుంచి పారా మిలటరీ దళాలను ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయం

  • ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ కు బలగాల తరలింపు
  • ప్రస్తుతం అక్కడ అదనంగా 100 కంపెనీల బలగాలు
  • వీటి స్థానంలో మోహరించనున్న సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ నుంచి 10 వేల మంది పారామిలటరీ సిబ్బందిని ఉపసంహరించాలని నిర్ణయించింది. ఆర్టికల్ 730 రద్దు, జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడకు పెద్ద సంఖ్యలో బలగాలను పంపించిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు బలగాలను తరలించారు. ప్రస్తుతం అక్కడ అదనంగా 40 కంపెనీల సీఆర్పీఎఫ్, 20 సీఐఎస్ఎఫ్, 20 బీఎస్ఎఫ్, 20 సహస్ర సీమా బల్ దళాలు ఉన్నాయి. ఈ బలగాల స్థానంలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ను నియమించిన తర్వాత వీటిని అక్కడి నుంచి ఉపసంహరిస్తారు.


More Telugu News