దళిత మహిళపై బీజేపీ నేతల దాష్టీకానికి నిదర్శనమిది!: వీడియో పోస్ట్ చేసిన మాజీ సీఎం కమల్‌నాథ్
- బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేదు
- మహిళ కుమార్తె భయపడిపోతూ గట్టిగా కేకలు పెట్టినా వినలేదు
- దళిత మహిళపై బహిరంగంగా దాడి
- నిందితులకే పోలీసుల రక్షణ
బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ మహిళపై ఒకరు దాడికి దిగడం కనపడుతోంది. ఆమెను తీవ్రంగా కొడుతూ రోడ్డుపై ఈడ్చుకొట్టినట్లు అందులో ఉంది.
ఆ మహిళ కుమార్తె భయపడిపోతూ గట్టిగా కేకలు పెడుతూ తల్లిని వదిలేయాలని ఏడుస్తున్నప్పటికీ వినిపించుకోలేదు. దళిత మహిళపై బీజేపీ నేతలు ఇంతటి దారుణానికి పాల్పడ్డారని కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేతుల్ జిల్లాలోని శోభాపూర్‌లో బీజేపీ నేతల తీరుకి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకే ఆ దళిత మహిళపై బహిరంగంగా దాడి చేశారని కమల్‌నాథ్ వివరించారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితులకే పోలీసులు అండగా నిలిచారని ఆయన ఆరోపణలు చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శివరాజ్ సింగ్ పాలనలో రాష్ట్రంలో పదే పదే ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయని, పోలీసులు కూడా నిందితులకే రక్షణ కల్పిస్తున్నారని ఆయన అన్నారు.