ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించాలి: సీఎం జగన్‌ ఆదేశాలు

  • కృష్ణానదిలోకి పోటెత్తిన వరద నీరు
  • కలెక్టర్లతో ఏపీ సీఎం సమీక్ష
  • బాధితులకు అండగా ఉండాలని ఆదేశం
  • అన్ని సౌకర్యాలు అందించాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాల ధాటికి కృష్ణానదిలోకి వరద నీరు పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ఈ రోజు ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అక్కడి  ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న నీటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గోదావరి ముంపు బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉండాలని జగన్ చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి నాలుగు లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తున్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని, ఎప్పటికప్పుడు వరదను అంచనా వేసుకుని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అక్కడి ప్రజలకు ఆహారం, మందులు వంటి అన్ని సౌకర్యాలు అందించాలని కోరారు.



More Telugu News