దేశంలో కరోనా ఉద్ధృతి.. 30 లక్షలు దాటేసిన కేసులు
- గత 24 గంటల్లో 69,239 మందికి కరోనా
- మొత్తం కేసులు 30,44,941
- మృతుల సంఖ్య మొత్తం 56,706
- 7,07,668 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 69,239 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 912 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 30,44,941 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 56,706 పెరిగింది. ఇక 7,07,668 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 22,80,567 మంది కోలుకున్నారు.
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,52,92,220 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.