ఇదో వికృత క్రీడ.. ఇలాగైతే ఏపీలో జరిగేది అభివృద్ధి కాదు.. విచ్ఛిన్నం: లోకేశ్

  • పాలకుడు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోవద్దు
  • మూడు ముక్కలాట సరికాదు
  • మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు
  • అమరావతి రైతులు రణభేరి మొదలుపెట్టి 250 రోజులు 
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఇటువంటి ఆలోచనను సీఎం జగన్‌ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ట్వీట్లు చేశారు. 'పాలకుడు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్ఛిన్నం. వైఎస్‌ జగన్‌ మూడు ముక్కలాట ఒక వికృత క్రీడ. మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు' అని విమర్శలు గుప్పించారు.

'రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతు న్యాయం చెయ్యమంటూ రణ భేరి మొదలుపెట్టి నేటికి 250 రోజులు అయ్యింది. ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. రాజధానిని మూడు ముక్కలు చేసే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ముందుకు రావాలి' అని నారా లోకేశ్ హితవు పలికారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడిన ఓ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.


More Telugu News